దేశీయ కందమూలాలు కాపాడుకుందాం

దేశీయ కందమూలాలు కాపాడుకుందాం

VSP: భారత దేశీయ కందమూలాలను పరిరక్షించుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. మద్దిలపాలెం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రకృతి పంటల సంతలో రైతులకు మాటంగు దుంపలు పంపిణీ చేశారు. పోషక విలువలు అధికంగా ఉన్న ఈ కందమూలాలను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన తెలిపారు.