యుటిఎఫ్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
కోనసీమ: కాట్రేనికోన మండలం యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం సాయంత్రం హైస్కూల్ ఆవరణలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎం.కమలేశ్వర్ పేరుశెట్టి, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ సత్తార్, కోశాధికారిగా పి.జగన్నాథరావు లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.