నెల్లూరులో తిక్కన పార్క్ పునః ప్రారంభం

NLR: పట్టణంలోని 52వ డివిజన్ పెన్నా నది ఒడ్డున తిక్కన పార్కును మంత్రి నారాయణ సోమవారం పునః ప్రారంభించారు. నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేసే క్రమంలో తిక్కన పార్కును ఆధునీకరించారు. వాకింగ్ ట్రాక్, జిమ్, చిన్నపిల్లలు ఆడుకునే పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.