గ్రంథాలయాలపై మాజీ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
VZM: గ్రంథాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకూడదని, విజ్ఞానవంతులు, గ్రంథాలయ ఉద్యమకారులను సంస్థల్లో నియమించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రొంగలి పోతన్న అన్నారు. గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రంథాలయాలు సమాజ అభ్యున్నతికి కీలకమని, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.