కాటన్ మిల్లును తనిఖీ చేసిన మార్కెట్ ఛైర్మన్

కాటన్ మిల్లును తనిఖీ చేసిన మార్కెట్ ఛైర్మన్

WGL: పరకాల పట్టణంలోని హనుమాన్ కాటన్ మిల్లును గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోలను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.