VIDEO: భద్రాచలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తుల రద్దీ అధికమైంది. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు శ్రీ సీతారాములను ప్రధాన ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకల్యాణం వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తులు దర్శనానికి గంటల పాటు క్యూలో నిలిచారు.