VIDEO: రాష్ట్రంలో 25 వేల ఆర్థిక సాయం గొప్ప అడుగు: ఎమ్మెల్యే
కృష్ణా: అసెంబ్లీలో CM చంద్రబాబు ప్రకటించిన పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు గురువారం హర్షం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం సాహసోపేత నిర్ణయాలు అవసరమన్నారు. స్వీడన్ దేశం జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తోందని, రాష్ట్రంలో 25 వేల ఆర్థిక సాయం గొప్ప అడుగన్నారు. అమెరికాలో ఐవీఎఫ్ ఉచితం లేదని చెప్పారు.