గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

JGL: ధర్మపురి పట్టణంలో గంజాయితో ఓ యువకుడిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన ఈసారపు ప్రణీత్ కుమార్ (25) గంజాయి తీసుకుని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఉండగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. అతడి వద్ద 60 గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.