శ్రావణమాసం ప్రత్యేక పూజలు

CTR: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ఆలయంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ఆకు పూజతో పాటు రంగురంగుల పుష్పాలతో అలంకరణ చేసి అభిషేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.