నూతన సర్పంచ్‌ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
BDK: అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం మద్దుకూరు సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ గెలుపొందిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందనర్భంగా మాజీ ఎమ్మెల్యే నూతన సర్పంచ్‌లకు శాలువా కప్పి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.