ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి స్వర్ణలత, సర్పంచ్ రమణమ్మ, వార్డు సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారతదేశానికి చేసిన ఆయన సేవలను కొనియాడారు.