మాజీ మంత్రి హరీష్ రావు తండ్రికి మాజీ ఎంపీ నివాళులు
MBNR: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏపి జితేందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.