‘మెట్రో, ఫ్లైఓవర్లతో విశాఖ ట్రాఫిక్‌కు పరిష్కారం’

‘మెట్రో, ఫ్లైఓవర్లతో విశాఖ ట్రాఫిక్‌కు పరిష్కారం’

విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు కీలకం కానుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్.రామకృష్ణారెడ్డి తెలిపారు. 76.70 కి.మీ. పొడవున 4 కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. NH-16 వెంట మెట్రో-కమ్ నాలుగు లేన్ ఫ్లైఓవర్ ప్రతిపాదించామన్నారు. మొత్తం 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని NHAI ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించారు.