ట్రంప్‌కు షాక్ ఇచ్చిన జిల్లా జడ్జి

అక్రమ వలసదారుల ఆశ్రయం కోసం కేటాయిస్తున్న నిధులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేయడాన్ని శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా జడ్జి విలియం ఆరిక్ తప్పుబట్టారు. వాటిని ఆపేయడానికి వీల్లేదని, వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో బోస్టన్, షికాగో, లాస్ ఏంజెల్స్, డెన్వర్‌తో సహా 30 నగరాలు, జిల్లాల్లో ఉంటున్న వలసదారులకు ఊరట లభించినట్లైంది.