T20 WC: నేడే సెమీఫైనల్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడబోతున్నాయి. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్‌గా చూడొచ్చు.