ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ కేంద్రంపై దాడి
ఖతార్‌లోని రాస్ లాఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దోహాకు ఉత్తరాన ఉన్న ఈ కీలక నగరంలో భారీ నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ అధికారికంగా ధృవీకరించింది. అనేక ఉత్పత్తి సదుపాయాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దాడితో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.