'ప్రజావాణి దరఖాస్తుల్లో అలసత్వం సహించేది లేదు'
BHPL: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను హెచ్చరించారు. సోమవారం IDOC కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 80 దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేశారు. ఈ సందర్భంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఉన్నారు.