తిక్కవరంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పున:ప్రారంభం

తిక్కవరంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పున:ప్రారంభం

తిరుపతి: చిల్లకూరు మండలం తిక్కవరం పంచాయతీ నందు సోమవారం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంను సర్పంచ్ పున: ప్రారంభించారు. ఉన్నత అధికారులు సంపద కేంద్రాల పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకుని రావాలని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓ.సతీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమణయ్య, సిబ్బంది మానస వీణ తదితరులు పాల్గొన్నారు.