గిద్దలూరులో 34 కేసులు నమోదు

గిద్దలూరులో 34 కేసులు నమోదు

ప్రకాశం: గిద్దలూరు మండలంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు 37 బృందాలుగా ఏర్పడి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. 2,726 సర్వీసులను తనిఖీ చేసిన విద్యుత్ విజిలెన్స్ అధికారులు అదనపు లోడు, విద్యుత్ చౌర్యం వంటి అంశాలలో రూ.2.42 లక్షలు జరిమానా విధించామని గిద్దలూరు డి.ఈ.ఈ శేషగిరిరావు వెల్లడించారు. దాడుల్లో మార్కాపురం, కంభం డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.