మంచి మనసు చాటుకున్నడీఈవో
ASR: పినకోట పంచాయతీకి చెందిన సొలబంగిలో ఇంటర్ వరకు చదివిన గెమ్మెల రమణను అనకాపల్లి డీఈవో దత్తత తీసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా చదువు ఆపేసిన విషయాన్ని తెలుసుకున్న డీఈవో జి. అప్పారావు నాయుడు విద్యార్థి చదువు నిమిత్తం దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసేవరకు అన్ని విద్యా అవసరాలు తానే భరించనున్నట్లు ప్రకటించారు.