ఇందారంలో తీవ్ర ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా ఇందారంలో ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం గొడవకు దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి ఫయాజ్, స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గొడవను సర్దుమణిగేలా చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.