'పేద ప్రజలకు సీఎం సహాయ నిధి గొప్ప వరం'

'పేద ప్రజలకు సీఎం సహాయ నిధి గొప్ప వరం'

SDPT: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి గొప్ప వరమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బంక చందు అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని పలువురు బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన బాధితులకు అందజేశారు. మండలంలోని మొత్తం 29 మందికి రూ.13.32 లక్షల విలువైన చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. ఆదివారం బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు.