బెంగళూర్ బేకరీకి రూ. 5వేల జరిమానా
సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న బెంగళూర్ బేకరీలో అపరిశుభ్రత, గడువు ముగిసిన చాక్లెట్ల విక్రయాలపై ఫిర్యాదు రావడంతో మున్సిపల్ అధికారులు ఈరోజు తనిఖీలు చేశారు. కమిషనర్ హన్మంత రెడ్డి ఆదేశాలతో ఎస్సై శ్రీనివాస్ యాజమాన్యానికి రూ. 5000 పెనాల్టీ విధించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.