ఒరిజినల్ కార్డు చూపిస్తేనే జీరో టికెట్

NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపో ఇన్‌ఛార్జ్ మేనేజర్ శివకేశ్ యాదవ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలకు ఉచిత జీరో టికెట్ ఇచ్చే క్రమంలో ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, రేషన్ కార్డ్ చూపిస్తేనే టికెట్ ఇవ్వాలని చెప్పారు. వీటితో పాటు ఏపీకి సంబంధించి ఏదైనా గుర్తింపు కార్డు ఒకటి చూపించినా జీరో టికెట్ ఇవ్వాలన్నారు.