'సెక్యూరిటీ గార్డుల యూనిఫాం మార్పు నిర్ణయం ఉపసంహరించాలి'

BDK: సింగరేణి సంస్థలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల యూనిఫాం మార్పు నిర్ణయాన్ని యజమాన్యం ఉపసంహరించుకోవాలని CITU రాష్ట్ర కమిటీ సభ్యుడు భూక్య రమేష్ డిమాండ్ చేశారు. శనివారం ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. యజమాన్యం ప్రైవేట్ ఏజెన్సీలతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపించారు. గతంలోలాగే ఖాకీ యూనిఫాం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.