వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సరస్వతీ మాత విగ్రహం ఆవిష్కరణ

RR: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్‌లో శుక్రవారం సరస్వతీ మాత విగ్రహాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ G E Ch విద్యాసాగర్ ఆవిష్కరించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ రాచా బత్తుల శ్రీహరిబాబు దంపతుల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని ఉన్నతాధికారులు సన్మానించారు.