దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం పరిశీలించారు. పంట నష్టంపై తక్షణమే అంచనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి ఉన్నారు.