'సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుక జరుపుకుందాం'

WGL: నూతన సంవత్సర వేడుకలను సంతోషకర వాతావరణంలో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, వాహనదారులు మద్యం సేవించి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని జరిమానతో పాటు జైలుకు పంపిస్తామని సీపీ హెచ్చరించారు.