'గణిత ఉపకరణాలను ఉపయోగించి బోధన చేపట్టాలి'
KMR: గణిత ఉపకరణాలను ఉపయోగించి బోధన చేపట్టాలని ప్రధానోపాధ్యాయులు శోభారాణి అన్నారు. లింగంపేట బాలికలు ఉన్నత పాఠశాలలో గురువారం సముదాయ గణిత ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో గణితం ల్యాబ్, ప్రయోగ దీపికల ద్వారా గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించాలని చెప్పారు. గణిత సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయుల కృషి చేయాలన్నారు.