రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: అచ్చెన్న

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: అచ్చెన్న

AP: రైతుల నుంచి పంటలు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి 24 గంటల్లో చెల్లింపులు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పంటకు మార్కెట్‌లో తక్కువ ధర ఉన్నా ఎక్కువకు కొనుగోలు చేస్తున్నామన్నారు. మినుములకు మార్కెట్ ధర రూ.6300 ఉండగా రూ. 7400 చొప్పున 18.02 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, కందుల ధర రూ.6500కు పడిపోయినా రూ.7550 చొప్పున 55 వేల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు.