మాజీ కో ఆప్షన్ సభ్యున్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు
MLG: ఏటూరునాగారం మండలానికి చెందిన మాజీ కో-ఆప్షన్ సభ్యులు, BRS పార్టీ నాయకులు ఎస్.కె ఖలీల్ అనారోగ్యంతో బాధపడుతూ HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా BRS పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఈరోజు ఆయనను పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకొని,మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.