రోదించిన మహిళా రైతు.. ఆదుకున్న ప్రభుత్వం
TG: సిద్ధిపేటలో మహిళా రైతు తారవ్వను సర్కార్ ఆదుకుంది. వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యానికి డబ్బు చెల్లించింది. దాదాపు 106 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయినట్లు అంచనా వేసింది. ఈ మొత్తం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,390 మద్దతు ధరతో రూ. 2,55,145 చెల్లించింది.