VIDEO: గంజాయి మత్తులో పోలీసులపై దాడి

VIDEO: గంజాయి మత్తులో పోలీసులపై దాడి

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో రెండు కుటుంబాల మధ్య పాత కక్షలతో గొడవ జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు చేరుకోగా, గంజాయి మత్తులో ఉన్న గుగులోత్ రవి, కుమార్ పోలీసులు మీదే దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలు అయ్యాయి. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.