8.1 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో GST వసూళ్లు 8.1% పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ గణాంకాలు విడుదల చేసింది. ఇదే సమయంలో తెలంగాణ 14%, ఏపీ 5% వృద్ధి నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా రూ.1,83,609 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ.1,69,779 కోట్లతో పోలిస్తే ఇది 8.1% అధికం. రీఫండ్లు పూర్తయిన తర్వాత నికర వసూళ్లు రూ.1,61,278 కోట్లకు చేరాయి.