VIDEO: మరవ విడుదలపై దండోరా..!

VIDEO: మరవ విడుదలపై దండోరా..!

CTR: పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువులోని జలాలను మరవ ద్వారా రేపు విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం పట్టణ పురవీధుల్లో దండోరా వేశారు. పుంగమ్మ కట్ట వద్ద పూజలు నిర్వహించి, జలహారతి తర్వాత మరవలో నీటిని విడుదల చేస్తున్నట్లు దండోరాలో తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని ఆహ్వానం పలికారు. ఇప్పటికే మరువ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.