పేకాట శిబిరంపై పోలీసుల దాడి
AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం సమీపంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.