విద్యార్థినిని చితకబాదిన లెక్చరర్

విద్యార్థినిని చితకబాదిన లెక్చరర్

SRCL: మార్కులు తక్కువ వచ్చాయని ఇంటర్ విద్యార్థిని చితకబాదిన ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చాయని లెక్చరర్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థినిని చితకబాదింది. విద్యార్థినికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో యాజమాన్యం సదరు లెక్చరర్‌ను విధుల్లోంచి తొలగించారు.