ప్రమాదకరంగా పంటకాలువ వంతెన
కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామం భూపతివారి పాలెం వద్ద ఉన్న పంట కాలువ వంతెన ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఈ వంతెనకు మెట్లు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే జారిపోతుందని, విద్యార్దులు జారి పడితే కాలువలో పడి ప్రాణాలు పోయే పరిస్తితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.