జిల్లాలో నకిలీ నోట్ల కలకలం
KMR: నకిలీ కరెన్సీ నోట్ల లావాదేవీలకు సంబంధించిన ఓ వ్యవహారం KMR జిల్లాలో కలకలం రేపింది.పెద్దకొడప్గల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి తాను బాకీ ఉన్న డబ్బును చెల్లించే క్రమంలో సంబంధిత వ్యక్తికి నకిలీ నోట్లను అందించాడు. ఈ నోట్లను పరిశీలించిన అవతలి వ్యక్తికి అవి నకిలీవని తేలడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు.