'రూ.145 కోట్లతో 13 ఆసుపత్రుల ఆధునికీకరణ'

SKLM: జిల్లాలో రూ.145 కోట్లతో 13 ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నట్లు ఏపీ ఎమ్ఎస్ఐడీసీ కార్యనిర్వహక ఇంజినీర్ ఎం.సత్య ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నరసన్నపేట,టెక్కలి,పాతపట్నం,పలాస, పాలకొండ,ఇచ్చాపురం,రణస్థలం ఆసుపత్రుల్లో 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్నారు.