వెంకోజిపాలెంలో సామూహిక కుంకుమార్చనలు

విశాఖపట్నం వెంకోజిపాలెం జంక్షన్‌లోని శ్రీ గౌరీజ్ఞానలింగేశ్వర ఆలయ ఆవరణలో, శ్రీ బాలాభాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత విచ్చేయగా వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. శివాభిషేకం అనంతరం 108 స్త్రీలు కుంకుమార్చనలో పాల్గొన్నారు.