గజ్జలమ్మదేవికి ప్రత్యేక పూజలు

గజ్జలమ్మదేవికి ప్రత్యేక పూజలు

ADB: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మదేవి జాతర(తీర్థం)ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏటా మృగశిర కార్తె జ్యేష్ట మాసంలో మొదటి ఆదివారం ఈ జాతరను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా భక్తులు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు నైవేద్యంగా ఓమ, ఉల్లిగడ్డలు, పేలాలు, పుట్నాలు నైవేద్యంతో బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.