రాష్ట్రంలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు

రాష్ట్రంలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు లండన్‌లో హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుజా గ్రూప్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖలో హిందుజా పవర్‌ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగావాట్లకు పెంచేందుకు, రాయలసీమ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.