ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్‌!

ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్‌!

AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్‌ 1 నుంచి నిలిపేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశ) ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం భారంగా మారిందని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యజమానులు తేల్చిచెప్పారు. 1వ తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టీమేటం ఇచ్చారు.