వంద కోట్ల మైలురాయి దాటిన బెజ్జంకి KDCC బ్యాంక్ వ్యాపారం

SDPT: కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బెజ్జంకి శాఖ తమ వ్యాపారంలో 100 కోట్ల రూపాయల మైలురాయి దాటింది. ఈ విషయంపై శాఖ మేనేజర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గత మూడు సంవత్సరాలలో శాఖ వ్యాపారం రెట్టింపు స్థాయిలో పెరిగిందని, ఈ వేగంతో వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోటీ ఇస్తూ ముందుకు సాగుతుందిన ఆయన తెలిపారు.