108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

NZB: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రవితకు ఆదివారం ఉదయం తీవ్రమైన కాన్పు నొప్పులు ప్రారంభమయ్యాయి. 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే సాధారణ ప్రసవం జరిగి ఆడబిడ్డ జన్మించింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సహాయపడిన 108 సిబ్బందికి, ఆశా వర్కర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.