ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో ఎమ్మెల్యే
BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించేందుకు ఇల్లందు, బయ్యారం మండల కేంద్రంలో ఇవాళ ఉచిత ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మహిళకు చీరలు పంపిణి చేశారు. అనంతరం పేద ప్రజలకు వైధ్యం ఖర్చులు భారం కాకుండా ప్రజా ప్రభుత్వం చేపట్టిన CMRF చెక్కులను అందజేశారు.