కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌కు నివాళులు

GNTR: కేరళ సీపీఎం నేత, మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ మృతికి సంతాపంగా బుధవారం పెదకాకాని గ్రామం ఆ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం నేత నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. భారతదేశ గర్వించదగ్గ రాజకీయ నేతల్లో అచ్యుతానందన్ ఆదర్శమయుడని తెలిపారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు.