VIDEO: జెడ్పీ హైస్కూల్‌ని తనిఖీ చేసిన డీఈవో
KRNL: నందవరం జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని డీఈవో శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు 10వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులకు భోజనం వడ్డించి, భోజనం నాణ్యతను ఆయన తెలుసుకున్నారు.