VIDEO: సంక్రాంతి సంబురాల్లో విదేశీ మహిళలు
HNK: కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్‌లో శనివారం ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కెనడా దేశం నుంచి వచ్చిన యువతీ- యువకులు, విదేశీ మహిళలు సంప్రదాయ తెలుగు వస్త్రధారణలో పాల్గొని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించారు. గ్రామీణ సంప్రదాయానికి ప్రతీకగా గంగిరెద్దుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.